అక్షరటుడే, ఎల్లారెడ్డి: పట్టణంలోని సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలలో ఆదివారం 2005-06 పదో తరగతి పూర్వ విద్యార్థులు ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థులందరూ ఒక్కచోట కలుసుకొని చిన్ననాటి మధుర జ్ఞాపకాలను గుర్తు చేసుకొని సరదాగా గడిపారు. పాఠాలు బోధించిన ఉపాధ్యాయులను సన్మానించారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు నెహ్రూ, రాఘవేందర్ చారి, మోహన్ రెడ్డి, శంకర్ నాయక్, తదితరులు పాల్గొన్నారు.