అక్షరటుడే, కామారెడ్డి: గ్రూప్-2 పరీక్షలకు హాజరు శాతం సగమే నమోదైంది. ఆదివారం నిర్వహించిన రెండు పరీక్షలకు అభ్యర్థులు అంతంతమాత్రంగానే హాజరయ్యారు. మొత్తం 8,085 మంది అభ్యర్థులు పరీక్ష రాయాల్సి ఉండగా.. ఉదయం 3,971 మంది హాజరు కాగా 4,114 మంది గైర్హాజరయ్యారు. మధ్యాహ్నం 3,917 మంది హాజరు కాగా.. 4,168 మంది పరీక్ష రాయలేదు. ఉదయం కంటే మధ్యాహ్నం 54 మంది ఎక్కువ గైర్హాజరయ్యారు. మొత్తంగా మొదటి రోజు 50 శాతం మాత్రమే హాజరయ్యారు. పరీక్ష కేంద్రాల వద్ద పోలీసుల బందోబస్తు కొనసాగింది. పరీక్ష కేంద్రాలను జిల్లా అడిషనల్ ఎస్పీ నర్సింహారెడ్డి పరిశీలించారు.