అక్షరటుడే, జుక్కల్: నారాయణఖేడ్ నుంచి కాళేశ్వరం బస్సు సర్వీసును అధికారులు ప్రారంభించారు. ఈ బస్సు నారాయణఖేడ్‌లో ఉదయం 10 గంటలకు బయలుదేరి నిజాంపేట్, పిట్లం ఎక్స్ రోడ్, నిజాంసాగర్, కామారెడ్డి, వేములవాడ, కొండగట్టు, ధర్మపురి మీదుగా కాళేశ్వరం చేరుకుంటుంది. ప్రయాణికులు సద్వినియోగం చేసుకోవాలని నారాయణఖేడ్ డిపో మేనేజర్ మల్లేశం కోరారు. మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్ పాండు పాల్గొన్నారు.