అక్షరటుడే, కోటగిరి: కోటగిరి మండలం ఎత్తోండ గ్రామ శివారులో అక్రమంగా మొరం తరలిస్తున్న రెండు జేసీబీలు, రెండు టిప్పర్లను అధికారులు బుధవారం రాత్రి పట్టుకున్నారు. తదుపరి చర్యల నిమిత్తం వాటిని సంబంధిత అధికారులకు అప్పగించినట్లు ఎస్సై సందీప్ తెలిపారు. అక్రమంగా మొరం తవ్వకాలు చేపడితే కఠిన చర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించారు.