అక్షరటుడే, బిచ్కుంద: ఆటో డ్రైవర్లు నిబంధనలు పాటించాలని ఎస్సై విజయ్ పేర్కొన్నారు. మద్నూర్ పోలీస్ స్టేషన్ లో గురువారం వారికి అవగాహన కల్పించారు. ఆటోలకు సంబంధించిన ధ్రువీకరణ పత్రాలు, డ్రైవింగ్ లైసెన్స్, ఇన్సూరెన్స్ వెంట ఉంచుకోవాలన్నారు. మద్నూర్ బస్టాండ్ లో ఆటోలను క్రమ పద్దతిలో నిలపాలని సూచించారు. మద్యం తాగి డ్రైవింగ్ చేస్తే కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు.