అక్షరటుడే, ఆర్మూర్ : లయన్స్ క్లబ్ ఆఫ్ ఆర్మూర్ నవనాథపురం ఆధ్వర్యంలో గురువారం గర్ల్స్ జూనియర్ కాలేజీలో క్యాన్సర్ వ్యాధి పై అవగాహన కల్పించారు. బ్రెస్ట్ క్యాన్సర్, సర్వైకల్ క్యాన్సర్‌ను అరికట్టడానికి తీసుకోవాల్సిన జాగ్రత్తలను వివరించారు. కార్యక్రమంలో క్లబ్ అధ్యక్షుడు చెరుకు పృథ్వీరాజ్, అంబల్ల తిరుపతి, బైరి శ్రీధర్, శశిధర్ రెడ్డి, ప్రసాద్ పాల్గొన్నారు.