అక్షరటుడే, భిక్కనూరరు : మండలంలోని కాచాపూర్, పెద్ద మల్లారెడ్డి గ్రామాల్లో ఎయిడ్స్‌ నియంత్రణ సంస్థ ఆధ్వర్యంలో శనివారం హెచ్‌ఐవీపై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఎల్‌ఈడీతో చిత్ర ప్రదర్శన రూపంలో హెచ్‌ఐవీ, ఎయిడ్స్‌ సంక్రమణ, నియంత్రణ, జాగ్రత్తలపై వివరించారు. హెచ్‌ఐవీ బాధితులకు సేవలు అందించే కేంద్రాల గురించి వివరించారు. కార్యక్రమంలో వైఆర్‌జీ కేర్‌ లింక్‌ వర్కర్‌ బాలకిషన్, ఆటో యూనియన్‌ నాయకులు, స్థానికులు పాల్గొన్నారు.