Advertisement
అక్షర టుడే, సిరికొండ: మండల కేంద్రంలోని తెలంగాణ చౌరస్తా వద్ద ఆదర్శ పాఠశాల/కళాశాల ఆధ్వర్యంలో శనివారం రోడ్డు భద్రతపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా పాఠశాల విద్యార్థులు పలు అవగాహన కార్యక్రమాలు చేపట్టారు. కార్యక్రమంలో తహసీల్దార్ రవీందర్ రావు, ఎంఈఓ రాములు, కానిస్టేబుళ్ళు హరీష్, శంకర్ పాఠశాల కళాశాల ప్రిన్సిపాల్ గడ్డం రాజేష్ రెడ్డి, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.
Advertisement