అక్షరటుడే, వెబ్ డెస్క్: తిరుమలలో నేడు స్థానికులకు శ్రీవారి దర్శనం టోకెన్లు జారీ చేయనున్నారు. ప్రతి నెల మొదటి మంగళవారం (జనవరి 07) స్థానికులకు కల్పించే దర్శనంలో భాగంగా ఈరోజు స్థానిక దర్శన కోటా టోకెన్లను టీటీడీ జారీ చేయనుంది. ఈ మేరకు తిరుపతి మహతి ఆడిటోరియంలోని కౌంటర్లు, తిరుమల బాలాజీ నగర్ కమ్యూనిటీ హాల్లో శ్రీవారి దర్శన టోకెన్లు జారీ చేస్తారు.