అక్షరటుడే, వెబ్‌డెస్క్: ప్రభుత్వం ఎల్ఆర్ఎస్ పేరిట ఒక్కో ప్లాట్ నుంచి రూ.లక్ష చొప్పున వసూలు చేసేందుకు యత్నిస్తోందని బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్‌రెడ్డి ఆరోపించారు. రేవంత్‌రెడ్డికి మాట తప్పడం అలవాటుగా మారిందని విమర్శించారు. తమ ప్రభుత్వ హయాంలో ఎల్ఆర్ఎస్ తీసుకొచ్చినప్పుడు కాంగ్రెస్ నాయకులు నిరసన తెలిపారని గుర్తు చేశారు. ఇప్పుడు అధికారంలోకి రాగానే రేవంత్‌రెడ్డి మాట మార్చారన్నారు. ఎల్ఆర్ఎస్ పేరిట ప్రజలను దోచుకోవాలని చూస్తే ఆందోళనలు చేస్తామని హెచ్చరించారు.