అక్షరటుడే, బాన్సువాడ: హైదరాబాద్ రవీంద్రభారతి ఆడిటోరియంలో జూలై 1న నిర్వహించనున్న జాతీయ బంజారా సమ్మేళనాన్ని విజయవంతం చేయాలని ఎస్టీ సెల్ జిల్లా ఉపాధ్యక్షుడు నరేశ్ రాథోడ్ నాయక్ పిలుపునిచ్చారు. శుక్రవారం పట్టణంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. సంఘం ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా నిర్వహించనున్న సదస్సుకు లంబాడి మేధావులు, పెద్దలు, విద్యార్థులు అధిక సంఖ్యలో హాజరు కావాలని కోరారు. కార్యక్రమంలో కాంగ్రెస్ ఎస్టీ సెల్ డివిజన్ అధ్యక్షుడు చంద్రనాయక్, ప్రధాన కార్యదర్శి రవిచవాన్, ఎల్ హెచ్ పి ఎస్ వర్ని మండలాధ్యక్షుడు సురేష్ కుమార్, నస్రుల్లాబాద్ మండలాధ్యక్షుడు అశోక్ లకావత్ పాల్గొన్నారు.