అక్షరటుడే, నిజామాబాద్సిటీ: తమ పెండింగ్ సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ బ్యాంక్ ఉద్యోగులు ధర్నాకు దిగారు. శుక్రవారం నగరంలోని ధర్నా చౌక్ వద్ద ఎస్బీఐ బ్యాంక్ ఎదుట నిరసన కార్యక్రమం చేపట్టారు. వారానికి ఐదురోజుల పనదినాలను వెంటనే అమలు చేయాలన్నారు. బ్యాంకుల్లో త్వరతగతిన శాశ్వత నియామకాలు చేపట్టాలని కోరారు. ప్రభుత్వం రంగ బ్యాంక్ ఉద్యోగుల గ్రాడ్యుటీని అమలులోకి తేవాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో ఎస్బీఐ ఉద్యోగులు రమేశ్, గురునాథ్, ప్రమోద్, శ్రీనివాస్, సుధాకర్, బ్యాంకు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.