అక్షరటుడే, బాన్సువాడ: విద్యార్థులు చదువుపై దృష్టి పెట్టి భవిష్యత్తుకు బంగారు బాటలు వేసుకోవాలని బాన్సువాడ జూనియర్ సివిల్ జడ్జి భార్గవి అన్నారు. పట్టణంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో మండల న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో ర్యాగింగ్ పై అవగాహన సదస్సు నిర్వహించారు. చెడు వ్యసనాలకు దూరంగా ఉండాలని, చట్టాలపై అవగాహన పెంచుకోవాలని సూచించారు. ర్యాగింగ్ కు పాల్పడడం నిషేధమని గుర్తుచేశారు. ఈ కార్యక్రమంలో బార్ అసోసియేషన్ అధ్యక్షుడు లక్ష్మీనారాయణ మూర్తి, న్యాయవాదులు ఖలీల్, మోహన్ రెడ్డి, ప్రిన్సిపాల్ నాగనాథ్ తదితరులు పాల్గొన్నారు.