అక్షరటుడే, బాన్సువాడ: మంజీర నది నుంచి ఇసుక అక్రమ రవాణా చేస్తే చర్యలు తప్పవని బాన్సువాడ సబ్ కలెక్టర్ కిరణ్మయి హెచ్చరించారు. గురువారం పట్టణంలోని తన కార్యాలయంలో ఏడీ మైన్స్, టీజీఎండీసీ, తహశీల్దార్లతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. మంజీర నదిలో అక్రమంగా ఇసుకను తరలిస్తున్నట్లు ఫిర్యాదులు వస్తున్నాయని, అధికారులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.