అక్షరటుడే, బాన్సువాడ: చెట్లే మానవ మనుగడకు ఆధారమని, ప్రతి ఒక్కరు చెట్లను సంరక్షించాలని ఆర్డీవో రమేష్ రాథోడ్ అన్నారు. మండలంలోని బోర్లం క్యాంప్, కొయ్యగుట్ట సాంఘిక సంక్షేమ బాలికల గురుకుల పాఠశాలలో ఆయన మొక్కలు నాటారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీవో బషీరుద్దీన్, ఎంపీవో సత్యనారాయణ రెడ్డి, ఎంఈవో నాగేశ్వరరావు, ప్రిన్సిపాల్ శైలజ, ఏపీవో గంగాధర్ తదితరులు పాల్గొన్నారు.