అక్షరటుడే, నిజాంసాగర్ : జుక్కల్ మండల కేంద్రంలోని తహశీల్ కార్యాలయాన్ని మంగళవారం బాన్సువాడ సబ్ కలెక్టర్ కిరణ్మయి తనిఖీ చేశారు. ఈ సందర్భంగా మండలంలోని ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో ఇప్పటి వరకు సేకరించిన ధాన్యం విషయాలను తహశీల్దార్ హిమబిందును అడిగి తెలుసుకున్నారు. కుటుంబ సర్వే ఆన్ లైన్ డేటా ఎంట్రీ, ధరణి సమస్యలు పలు అంశాలపై ఆమె చర్చించారు. ఆమె వెంట జిల్లా ఎస్సీ వెల్ఫేర్ అధికారి రజిత తదితరులున్నారు.