అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: బాసర ట్రిపుల్ ఐటీ వీసీ ప్రొఫెసర్ గోవర్ధన్‌ను నిర్మల్ జిల్లా భైంసా మార్కెట్ కమిటీ ఛైర్మన్ ఆనంద్ రావ్ పాటిల్ శనివారం మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఆయనను శాలువాతో సన్మానించారు. వర్సిటీలో విద్యార్థులకు ఇబ్బందులు లేకుండా అన్ని చర్యలు చేపట్టాలని కోరారు. ఆయన వెంట సుధాకర్ రెడ్డి ఉన్నారు.