అక్షరటుడే, ఇందూరు: నగరంలోని కేర్ డిగ్రీ కళాశాలలో శనివారం బతుకమ్మ సంబరాలు జరిపారు. నాలుగో రోజు ‘నానే బియ్యం బతుకమ్మ’ను భక్తితో పూజించారు. కార్యక్రమంలో విద్యావేత్త స్వప్న, మహిళా అధ్యాపకులు అనురాధ, కళ్యాణి, కవిత, రవీనా, దీప్తి, విద్యార్థులు పాల్గొన్నారు.