అక్షరటుడే, ఆర్మూర్‌, బాన్సువాడ : పాఠశాలల్లో సోమవారం ముందస్తుగా బతుకమ్మ సంబరాలు నిర్వహించారు. బాన్సువాడ డివిజన్‌లోని నస్రుల్లాబాద్‌ వెంకటసాయి పాఠశాలలో, ఆర్మూర్‌ మున్సిపల్‌ పరిధిలోని మామిడిపల్లి ప్రజ్ఞా పాఠశాలలో బతుకమ్మ వేడుకలు చేశారు. విద్యార్థులు రంగురంగుల వర్ణాలతో బతుకమ్మలను పేర్చారు. బతుకమ్మల చుట్టూ తిరుగుతూ నృత్యాలు చేశారు. అనంతరం బతుకమ్మలను నిమజ్జనం చేశారు.