అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: తమ సమస్యలు పరిష్కరించాలని రాష్ట్రంలోని అన్ని బెటాలియన్ల కానిస్టేబుళ్లు నిరసన బాట పట్టారు. శనివారం ఆయా బెటాలియన్ల పరిధిలో ఆందోళనలు నిర్వహించారు. రాష్ట్రవ్యాప్తంగా ఏక్ పోలీస్ విధానం అమలు చేయాలని డిమాండ్ చేశారు. ఈ క్రమంలో తమ కుటుంబ సభ్యులతో దురుసుగా ప్రవర్తించిన నల్గొండ రూరల్ ఎస్సై సైదాబాబును సస్పెండ్ చేయాలని కానిస్టేబుళ్లు డిమాండ్ చేశారు. శాంతియుతంగా నిరసన చేపడుతున్న తమ కుటుంబ సభ్యులను ఎస్సై అసభ్యకరంగా తిట్టారని వారు ఆరోపించారు. రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం నాగార్జునసాగర్ హైవేపై మహేశ్వరం డీసీపీ సునీత రెడ్డితో కానిస్టేబుళ్ల కుటుంబ సభ్యులు వాగ్వాదం చేశారు. ఈ క్రమంలో పోలీసులకు వారికి మధ్య తోపులాట జరిగింది.