అక్షరటుడే, ఆర్మూర్‌ : రాష్ట్రంలో బీసీలకు 42 శాతం రిజర్వేషన్‌ కల్పించాలని బీసీ జనసభ రాష్ట్ర అధ్యక్షుడు రాజారాం యాదవ్‌ డిమాండ్‌ చేశారు. మెట్‌పల్లి బస్టాండ్‌ వద్ద బీసీ సంఘాల జేఏసీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న బీసీల సత్యాగ్రహ దీక్ష శిబిరంలో బుధవారం ఆయన మాట్లాడారు. బీసీలను మోసం చేయాలని చూస్తే ప్రజాక్షేత్రంలో కాంగ్రెస్‌ పార్టీకి, సీఎంకు పుట్టగతులుండవన్నారు.