అక్షరటుడే, నిజామాబాద్ సిటీ : మహాత్మ జ్యోతిబాపూలే గొప్ప సంఘసంస్కర్త అని బీసీ సంక్షేమ సంఘం నాయకులు అన్నారు. సంఘం ఆధ్వర్యంలో పూలే వర్ధంతిని గురువారం నగరంలో నిర్వహించారు. ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. బీసీ సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షుడు సుధాకర్, రాష్ట్ర ఉపాధ్యక్షుడు బుస్స ఆంజనేయులు, నరాల సుధాకర్, దర్శనం దేవేందర్, కొయ్యాడ శంకర్, శ్రీలత, గురుచరణం, వాసం జయ, రుక్మిణి, సత్యనారాయణ, జనార్దన్ పాల్గొన్నారు.