అక్షరటుడే, కామారెడ్డి టౌన్‌: బీడీ కార్మికులకు పీఎఫ్‌ కటాఫ్‌ తేదీ ఎత్తివేసి, ఆంక్షలు లేకుండా రూ.4,016 జీవనభృతి అందించాలని బీడీ కార్మికులు డిమాండ్‌ చేశారు. బుధవారం కలెక్టరేట్‌ వద్ద బీఎల్‌టీయూ, శ్రామికశక్తి తెలంగాణ బీడీవర్కర్స్‌ యూనియన్‌ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. కాంగ్రెస్‌ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏడాదైనా జీవనభృతి అమలు చేయడం లేదన్నారు. వెంటనే అసెంబ్లీ సమావేశాల్లో ప్రకటన చేయాలని డిమాండ్‌ చేశారు. కార్యక్రమంలో బీఎల్‌టీయూ రాష్ట్ర అధ్యక్షుడు సిద్దిరాములు, ఉపాధ్యక్షుడు ఎల్లయ్య, ప్రధాన కార్యదర్శి ఆంజనేయులు, బహుజన మహిళ సంఘం జిల్లా నాయకురాలు లక్ష్మి, బీడీఎస్‌ఎఫ్‌ నాయకులు, బీడీ కార్మికులు పాల్గొన్నారు.