అక్షరటుడే, ఇందూరు: ‘భగవద్గీత జీవన గీత’ అని ఇస్కాన్ ప్రతినిధి బలరామదాసు ప్రభుజి అన్నారు. గీతా జయంతిని పురస్కరించుకొని అఖిల భారతీయ గీతా ప్రచారమండలి ఆధ్వర్యంలో గురువారం భగవద్గీత వారోత్సవాలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మానవుని సమస్యలన్నింటికీ సమాధానాలు గీతలో ఉంటాయని బోధించారు. కార్యక్రమంలో సమన్వయకర్త దయానంద్, గీత భవన్ అధ్యక్షుడు నరసింహచార్యులు, నారాయణ, యోగా రాంచందర్, లక్ష్మీనారాయణ, ప్రభాకర్ రావు, నరేందర్ రావు, చంద్రశేఖర్ శర్మ తదితరులు పాల్గొన్నారు.