అక్షరటుడే, వెబ్‌డెస్క్ : ప్రభుత్వ ఉద్యోగులకు పదవీ విరమణ సహజమని భైంసా ఏఎంసీ ఛైర్మన్ ఆనంద్‌రావు పటేల్ అన్నారు. భైంసా ఏఎంసీ ద్వితీయ శ్రేణి కార్యదర్శి శ్రీనివాస్ ఉద్యోగ విరమణ పొందగా, సోమవారం ఏఎంసీ కార్యాలయ ఆవరణలో ఆయనకు వీడ్కోలు కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ.. ఆయన చేసిన ఉద్యోగ సేవలను కొనియాడారు. అనంతరం శాలువా, పూలమాలతో సత్కరించారు. కార్యక్రమంలో ఏఎంసీ వైస్ ఛైర్మన్ ఫారూక్ అహ్మద్, డైరెక్టర్లు, ఉన్నత శ్రేణి కార్యదర్శి పూర్యానాయక్, వ్యాపారులు పాల్గొన్నారు.