అక్షరటుడే, వెబ్ డెస్క్: ఫార్ములా ఈ-కార్ రేస్‌ కేసు వ్యవహారంలో భారాస కార్యనిర్వాహక అధ్యక్షుడు, మాజీ మంత్రి కేటీఆర్‌ నేడు ఏసీబీ విచారణకు హాజరుకానున్నారు. ఉదయం 10 గంటలకు బంజారాహిల్స్‌లోని ఏసీబీ కార్యాలయానికి వెళ్లనున్నారు. ఈ నేపథ్యంలో మాజీ మంత్రి హరీశ్‌రావు నివాసం వద్ద పోలీసులు భారీగా మోహరించారు. ఆయన్ను గృహ నిర్బంధం చేశారు.