అక్షరటుడే, వెబ్ డెస్క్: రూ.రెండు లక్షలలోపు ప్రతి రైతుకు రుణమాఫీ చేయాలని భారతీయ కిసాన్ సంఘ్ నిర్మల్ జిల్లా అధ్యక్షుడు రవీందర్ డిమాండ్ చేశారు. ఈ మేరకు నిర్మల్ కలెక్టర్ కు బుధవారం వినతిపత్రం అందజేశారు. రైతులందరికీ రుణమాఫీ అమలు చేయాలని, లేనిపక్షంలో రైతులకు మద్దతుగా ఆందోళనలు చేస్తామని తెలిపారు. కార్యక్రమంలో నాయకులు నారాయణ రెడ్డి, రాజేశ్వర్ తదితరులు పాల్గొన్నారు.