అక్షరటుడే, కామారెడ్డి టౌన్: ప్రభుత్వం రైతులకు తక్షణమే రూ.2లక్షల రుణమాఫీ చేయాలని భారతీయ కిసాన్ సంఘ్ సభ్యులు డిమాండ్ చేశారు. గురువారం లింగాపూర్ లో నిర్వహించిన సమావేశంలో జిల్లా అధ్యక్షుడు విఠల్ రెడ్డి మాట్లాడారు. ప్రతి పంటకు బీమా కల్పించాలని, ప్రతి పంటకు రూ.500 బోనస్ ఇవ్వాలని తీర్మానించినట్లు పేర్కొన్నారు. సోమవారం చలో కలెక్టరేట్ చేపట్టనున్నట్లు పేర్కొన్నారు. జోనల్ అధ్యక్షుడు వెంకట్ రెడ్డి, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆనందరావు, ఉపాధ్యక్షుడు నగేష్, జిల్లా కార్యదర్శి శంకర్ రావు, కార్యవర్గ సభ్యులు, మండల అధ్యక్ష కార్యదర్శులు పాల్గొన్నారు.