అక్షరటుడే, బాన్సువాడ: పట్టణంలోని పోలీస్ స్టేషన్ వద్ద భవానీ మాలధారణ స్వాములు ఆదివారం సాయంత్రం రాస్తారోకో చేశారు. మహమ్మద్ నగర్ మండలం గాలిపూర్ కు చెందిన ఇద్దరు స్వాములు ద్విచక్రవాహనంపై కొయ్యగుట్ట వెళ్తుండగా బాన్సువాడ మండలం జెకె తండాకు చెందిన ఇద్దరు వ్యక్తులు బైక్ తో ఢీ కొట్టారు. దీంతో స్వల్ప తగాదా తలెత్తగా.. వారు ఓ స్వామి మెడలోని మాలను ఆవేశంతో తెంపేశారు. దీంతో ఆగ్రహించిన స్వాములు పోలీస్ స్టేషన్ కు చేరుకున్నారు. మద్యం మత్తులో బైక్ తో ఢీకొట్టారని, వారిని అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు. వీరికి పలువురు స్వాములు మద్దతుగా రాస్తారోకో చేపట్టారు. పోలీసులు సముదాయించి న్యాయం చేస్తామని తెలపడంతో వారు ఆందోళన విరమించారు.