అక్షరటుడే, భీమ్‌గల్: నింబాచల లక్ష్మీనరసింహ ఆలయ క్షేత్ర పాలకురాలిగా ఉన్న పెద్ద వేముగంటి (బడా భీమ్‌గల్) ఎల్లమ్మ తల్లికి అర్చకులు గురువారం తొలిపూజ నిర్వహించారు. లక్ష్మీనరసింహస్వామి గుట్ట ఎక్కే ముందు, జాతర బ్రహ్మోత్సవాలు ప్రారంభానికి మొదలు ఎల్లమ్మ తల్లికి పూజ చేయడం ఆనవాయితీగా వస్తోంది