అక్షరటుడే, వెబ్ డెస్క్: బిచ్కుంద పోలీసులు నిషేధిత మత్తు పదార్థాలను సీజ్ చేశారు. కల్తీ కల్లు తయారీలో వినియోగించే అల్ఫాజోలాన్ని స్వాధీనం చేసుకున్నారు. టాస్క్ఫోర్స్ సీఐ తిరుపయ్య, బిచ్కుంద సీఐ జగడం నరేష్ ఆధ్వర్యంలో శుక్రవారం తనిఖీలు జరిపారు. పెద్దదేవాడకు చెందిన గంగాగౌడ్ నుంచి 240 గ్రాముల అల్ఫాజోలం మిక్సింగ్ పౌడర్ సీజ్ చేశారు. అతను ఇచ్చిన సమాచారం మేరకు బొల్లపల్లి గ్రామానికి చెందిన హన్మాగౌడ్ కల్లు కాంపౌండ్ లో 10 గ్రాముల అల్ఫాజోలం, 33 గ్రాముల గంజాయి స్వాధీనం చేసుకున్నారు. మరో వ్యక్తి శివకుమార్ వద్ద 33 గ్రాముల అల్ఫాజోలం నిల్వలు గుర్తించారు. ముగ్గురు నిందితులను అరెస్ట్ చేసినట్లు బాన్సువాడ డీఎస్పీ సత్యనారాయణ తెలిపారు. కేసు ఛేదనలో కీలకంగా వ్యవహరించిన సీఐలు తిరుపయ్య, నరేష్, ఎస్సైల బృందాన్ని అభినందించారు.