అక్షరటుడే, జుక్కల్: బిచ్కుంద మండలంలోని కందర్ పల్లి శివారులో పేకాడుతున్న తొమ్మిది మందిని అరెస్ట్ చేసినట్లు బిచ్కుంద ఎస్సై మోహన్ రెడ్డి తెలిపారు. కందర్ పల్లి శివారులో పేకాడుతున్నట్లు సమాచారం రావడంతో మంగళవారం మధ్యాహ్నం తనిఖీలు జరిపారు. తొమ్మిది మందిని పట్టుకుని వారి వద్ద నుంచి ఐదు బైకులు, రూ.18,440 స్వాధీనం చేసుకున్నారు. కేసు నమోదు చేసినట్లు ఎస్సై తెలిపారు.