అక్షరటుడే, ఇందూరు: విద్యార్థులు ప్రతిభా పరీక్షలను రాయాలని డీఈవో అశోక్ సూచించారు. జీవశాస్త్రం ఫోరం జిల్లా కమిటీ ఆధ్వర్యంలో బుధవారం నగరంలోని రాధాకృష్ణ పాఠశాలలో ప్రతిభా పరీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. విద్యార్థుల్లో దాగి ఉన్న ప్రతిభను వెలికితీయడానికి పరీక్షలు ఉపయోగపడతాయన్నారు. కార్యక్రమంలో ఫోరం జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు శేఖర్, గోవర్ధన్, సైన్స్ అధికారి గంగాకిషన్, రాష్ట్ర బాధ్యులు ఎంవీఆర్ చారి, సాయిబాబా, ప్రశాంత్, మధుసూదనాచారి పాల్గొన్నారు.