అక్షరటుడే, కామారెడ్డి: భిక్కనూరు మండలం మల్లుపల్లి గ్రామానికి చెందిన బీజేపీ కార్యకర్త నారాయణ ఇటీవల మరణించారు. విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే కాటిపల్లి వెంకట రమణారెడ్డి ఆదివారం నారాయణ కుటుంబ సభ్యులను పరామర్శించారు. నారాయణ కూతురు, కొడుకుల వివరాలు అడిగి తెలుసుకున్నారు. అధైర్య పడొద్దని, అండగా ఉంటానని వారికి ఎమ్మెల్యే భరోసానిచ్చారు.