అక్షరటుడే, బాన్సువాడ: ప్రజల ఆశీర్వాదంతో ముచ్చటగా మూడో సారీ మోడీనే దేశ ప్రధాని అవుతారని జహీరాబాద్ పార్లమెంట్ ఇన్చార్జి, కామారెడ్డి ఎమ్మెల్యే కాటిపల్లి వెంకటరమణారెడ్డి అన్నారు. శుక్రవారం బాన్సువాడ బీజేపీ కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. జహీరాబాద్ పార్లమెంట్ నియోజకవర్గం ఏర్పడినప్పటి నుంచి అభివృద్ధి శూన్యమని, గతంలో ఎంపీగా చేసిన సురేష్ షెట్కార్, బీబీ పాటిల్ అభివృద్ధి చేయలేదన్నారు. సీఎం రేవంత్ రెడ్డి ఆర్టీసీ స్థలాలను లీజుకి ఇచ్చే ఆలోచనలో ఉన్నారని, ఇలాంటి తప్పుడు నిర్ణయాలు సరికావన్నారు. ఈ సమావేశంలో మాజీ ఎమ్మెల్యే యెండల లక్ష్మీనారాయణ, జిల్లా అధ్యక్షురాలు అరుణతార, పైడి ఎల్లారెడ్డి, దొరబాబు, పైడిమల్ లక్ష్మీనారాయణ పాల్గొన్నారు.