అక్షరటుడే, ఆర్మూర్ : ఢిల్లీ ఎన్నికల్లో బీజేపీ విజయం సాధించడంతో ఆర్మూర్ మండలం ఇస్సాపల్లి గ్రామంలో ఆ పార్టీ నాయకులు సంబురాలు చేసుకున్నారు. పటాకులు కాల్చి, స్వీట్లు పంచి పెట్టారు. కార్యక్రమంలో బీజేపీ జిల్లా అధికార ప్రతినిధి కలిగొట గంగాధర్, బండి శ్రీహరి, ధార్ల చిన్న ముత్తెన్న, బాగాయి సురేష్, భానుచందర్, శెట్పల్లి ముత్తెన్న, ఉమ్మడి చిన్నయ్య, బొంత పున్నం, చిరంజీవి, సాయిరెడ్డి పాల్గొన్నారు.