అక్షరటుడే, ఆర్మూర్: ఆలూరు మండల కేంద్రంలో బీజేపీ సభ్యత్వ నమోదు కార్యాశాలను మండల అధ్యక్షుడు కొత్తూరు గంగాధర్ ఆధ్వర్యంలో శుక్రవారం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జిల్లా అధికార ప్రతినిధి కలిగొట గంగాధర్, అసెంబ్లీ కన్వీనర్ గంగోని సంతోష్ హాజరయ్యారు. ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ.. సెప్టెంబర్ ఒకటి నుంచి నిర్వహించే సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు. నాయకులు యాదగిరి, సూర్య శ్రీకాంత్, మల్లయ్య, లోక రామ్‌రెడ్డి, హర్ష, హరీష్, రాజేష్, లావణ్య ప్రసాద్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.