అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: తెలంగాణ శాసనసభ సమావేశాలు సోమవారం ప్రారంభం కాగా.. తొలిరోజే ప్రొటోకాల్‌ అంశంపై చర్చ జరిగింది. ఈ అంశాన్ని బీజేపీ ఎమ్మెల్యేలు పైడి రాకేశ్‌రెడ్డి, కాటిపల్లి వెంకట రమణారెడ్డి సభలో లేవనెత్తారు. రాకేశ్‌రెడ్డి మాట్లాడుతూ.. “తాము ప్రజలు ఎన్నుకున్న సభ్యులం కాదా” అని ప్రశ్నించారు. “అసెంబ్లీలో మాట్లాడకూడదా..” అంటూ ఫైర్‌ అయ్యారు. కేవీఆర్‌ మాట్లాడుతూ మంత్రులు తమను గుర్తించడం లేదని.. ఎక్కడా ప్రొటోకాల్‌ పాటించడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రొటోకాల్‌ ఉల్లంఘనలపై సభలో చర్చించకపోతే ఊరుకోబోమని స్పష్టం చేశారు.