అక్షరటుడే, వెబ్‌డెస్క్: జైలులో ఉన్న వికారాబాద్ జిల్లా లగచర్ల రైతులతో బీజేపీ ఎంపీలు ములాఖత్ అయ్యారు. ఎంపీలు ఈటల రాజేందర్, డీకే అరుణ రైతులను పరామర్శించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ఫార్మా కంపెనీకి భూములు ఇవ్వమంటూ రైతులు ఎనిమిది నెలలుగా ఆందోళన చేస్తున్నారని పేర్కొన్నారు. బలవంతంగా లాక్కోవాలని చూడడంతోనే రైతులు ఆగ్రహించారని తెలిపారు. పోలీసుల వైఫల్యంతోనే లగచర్ల ఘటన చోటు చేసుకుందని డీకే అరుణ అన్నారు. కాంగ్రెస్ నాయకులే దాడులు చేయించారని ఈటల రాజేందర్ ఆరోపించారు. అరెస్ట్ చేసిన రైతులను వెంటనే విడుదల చేయాలని వారు డిమాండ్ చేశారు. ఈ ఘటనపై పార్లమెంట్‌లో ప్రివిలేజ్ మోషన్ వేస్తామని పేర్కొన్నారు.