అక్షరటుడే, కామారెడ్డి: తనను గెలిపిస్తే ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారం కోసం కృషి చేస్తానని బీజేపీ టీచర్స్​ ఎమ్మెల్సీ అభ్యర్థి కొమురయ్య అన్నారు. కామారెడ్డిలో తపస్​ ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థి అంజిరెడ్డితో కలిసి ఆయన పాల్గొన్నారు. వారు మాట్లాడుతూ.. ప్రభుత్వాలు మారుతున్నా ఉపాధ్యాయుల సమస్యలకు పరిష్కారం లభించడం లేదన్నారు. బడ్జెట్లో విద్యావ్యవస్థ బలోపేతం కోసం కేంద్రం 17 శాతం నిధులు కేటాయిస్తే, రాష్ట్ర ప్రభుత్వం 8 శాతమే కేటాయించిందన్నారు. ఈ సమావేశంలో తపస్ రాష్ట్ర అధ్యక్షుడు హన్మంత్ రావు, జిల్లా అధ్యక్షుడు రాఘవరెడ్డి పాల్గొన్నారు.