అక్షరటుడే, ఇందూరు: తనను గెలిపిస్తే ఉపాధ్యాయుల సమస్యలను పరిష్కరిస్తానని బీజేపీ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ అభ్యర్థి మల్క కొమురయ్య తెలిపారు. బుధవారం నగరంలోని నిఖిల్​సాయి హోటల్​లో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గత ప్రభుత్వాలు ఉపాధ్యాయులకు అన్యాయం చేశాయని.. సమయానికి వేతనం ఇవ్వకుండా ఇబ్బందులు పెట్టారన్నారు. విద్యాసంస్థల బకాయిల విడుదలకు పోరాటం చేస్తానన్నారు. అర్బన్ ఎమ్మెల్యే ధన్​పాల్​ సూర్యనారాయణ గుప్తా మాట్లాడుతూ.. ఎమ్మెల్సీ ఎన్నికలకు 20 రోజులు ఉందని, ప్రతి కార్యకర్త గెలుపు కోసం కష్టపడాలన్నారు. కార్యక్రమంలో జిల్లా అధ్యక్షుడు దినేష్ కులాచారి, రాష్ట్ర నాయకులు మల్లికార్జున్​ రెడ్డి, మేడపాటి ప్రకాష్, టక్కర్ హనుమంత్ రెడ్డి లక్ష్మీనారాయణ, స్రవంతి రెడ్డి తదితరులు పాల్గొన్నారు.