అక్షరటుడే, నిజాంసాగర్: గుర్తు తెలియని వాహనం ఢీకొని కృష్ణ జింకకు తీవ్ర గాయమైంది. పిట్లం మండలం గద్దగుండు తండా వద్ద జాతీయ రహదారి 161పై బుధవారం గుర్తు తెలియని వాహనం ఢీకొని కృష్ణ జింకకు గాయాలయ్యాయి. సమాచారం అందుకున్న హైవే సిబ్బంది జింకను అంబులెన్స్‌లో పిట్లం పశువైద్యశాలకు తరలించగా.. పశు వైద్యాధికారి సంతోష్‌ చికిత్స అందించారు. అనంతరం కృష్ణ జింకను అటవీ అధికారులకు అప్పగించారు.