అక్షరటుడే, ఎల్లారెడ్డి: మండలకేంద్రంలోని తెలంగాణ మైనారిటీ బాలుర రెసిడెన్షియల్ పాఠశాలలో గురువారం విద్యార్థులకు దుప్పట్లు పంపిణీ చేశారు. ప్రిన్సిపాల్ మహమ్మద్ రఫత్ మాట్లాడుతూ.. ప్రభుత్వం నుంచి దుప్పట్లు రాగా విద్యార్థులకు అందించినట్లు పేర్కొన్నారు. కార్యక్రమంలో బోధన, బోధనేతర సిబ్బంది పాల్గొన్నారు.