అక్షరటుడే, కామారెడ్డి గ్రామీణం: ప్రభుత్వం షరతులు లేకుండా బీడీ కార్మికులకు జీవనభృతి అమలు చేయాలని బీఎల్టీయూ రాష్ట్ర అధ్యక్షుడు దండి వెంకట్ డిమాండ్ చేశారు. సోమవారం దోమకొండ మండలకేంద్రంలో భారీ ర్యాలీ చేపట్టి, అనంతరం తహసీల్దార్ కార్యాలలయాన్ని ముట్టడించారు. కార్యక్రమంలో తెలంగాణ బహుజన బీడీ కార్మిక సంఘం, బీఎల్టీయూ నాయకులు సిద్ధ రాములు, ఆంజనేయులు, ఏఐఎఫ్టీయూ రాష్ట్ర నాయకులు వెంకట్ లక్ష్మి, అనుసూయ, లింగం, నాంపల్లి తదితరులు పాల్గొన్నారు.