అక్షరటుడే, బాన్సువాడ: పర్యావరణాన్ని పరిరక్షించాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని ఆర్డీవో రమేశ్ రాథోడ్ అన్నారు. వన మహోత్సవంలో భాగంగా మండలంలోని దేశాయిపేట్, సోమేశ్వర్ గ్రామాల్లో ఎంపీడీవో బషీరుద్దీన్తో కలిసి మొక్కలు నాటారు. వన మహోత్సవాన్ని ఉద్యమంలా నిర్వహించడం ద్వారా భావితరాలకు ఎంతో ప్రయోజనం చేకూరుతుందన్నారు. మొక్కలు పెరిగేందుకు అనువైన ప్రాంతంలో వాటిని నాటాలని సూచించారు. కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శులు రవి, నర్సింలు, రాము, పొంచిరాం, వీరేశం తదితరులు పాల్గొన్నారు.