అక్షరటుడే, నిజామాబాద్​సిటీ : క్రీడలతో మానసికోల్లాసం లభిస్తుందని మాజీ మంత్రి, బోధన్​ ఎమ్మెల్యే సుదర్శన్​రెడ్డి అన్నారు. నగరంలోని పాలిటెక్నిక్​ గ్రౌండ్​లో వెల్​నెస్​ హాస్పిటల్స్​ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న క్రికెట్​ లీగ్​ను సోమవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. విద్యార్థుల కోసం క్రికెట్ లీగ్​ నిర్వహించడం అభినందనీయమన్నారు. విద్యార్థులు, చదువుతో పాటు ఆటలపై దృష్టి పెట్టాలని సూచించారు. ఈ లీగ్​ను హాస్పిటల్​ ఎండీ సుమన్ గౌడ్, అసద్ ఖాన్, వివేక్ రెడ్డి, వైస్ ప్రెసిడెంట్ అశోక్ కుమార్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేయగా 24 టీంలు పాల్గొంటున్నాయి. కార్యక్రమంలో ఉర్దూ అకాడమీ ఛైర్మన్​ తాహెర్​ బిన్​ హందాన్​, కాంగ్రెస్​ జిల్లా అధ్యక్షుడు మానాల మోహన్​రెడ్డి, వ్యవసాయ కమిషన్ సభ్యుడు గడుగు గంగాధర్, నుడా ఛైర్మన్​ కేశ వేణు, గ్రంథాలయ సంస్థ ఛైర్మన్​ రాజారెడ్డి, యువజన కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడు విపుల్ గౌడ్ పాల్గొన్నారు.