అక్షరటుడే, ఆర్మూర్: కాంగ్రెస్​ ప్రభుత్వం ఏడాదిలో 55 వేల ఉద్యోగాలు భర్తీ చేసి యువతకు అండగా నిలిచిందని బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి అన్నారు. ఆర్మూర్ పట్టణంలోని పీవీఆర్ హోటల్​లో ఆదివారం పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నిక సన్నాహక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. బీఆర్​ఎస్​, బీజేపీ మాటలు నమ్మి పట్టభద్రులు మోసపోవద్దని సూచించారు. కాంగ్రెస్ అభ్యర్థి నరేందర్ రెడ్డికి మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించాలని కోరారు. కార్యక్రమంలో వర్ధన్నపేట ఎమ్మెల్యే నాగరాజ్, మహబూబాబాద్ ఎమ్మెల్యే భూక్య మురళి నాయక్, ఉర్దూ అకాడమీ ఛైర్మన్ తాహెర్​ బిన్​ హందాన్​, మాజీ ఎమ్మెల్సీ నర్సారెడ్డి, డీసీసీబీ ఛైర్మన్ రమేష్ రెడ్డి, సీడ్స్​ కార్పొరేషన్ ఛైర్మన్ అన్వేష్ రెడ్డి, టీఎస్ ఎంబీసీ ఛైర్మన్ అనిల్, జిల్లా గ్రంథాలయ సంస్థ ఛైర్మన్ రాజారెడ్డి, వినయ్ రెడ్డి, సునీల్ రెడ్డి పాల్గొన్నారు.