అక్షరటుడే, కోటగిరి: డ్రంకన్ డ్రైవ్ కేసులో ఇద్దరు నిందితులకు బోధన్ సెకండ్ క్లాస్ మేజిస్ట్రేట్ శేషతల్ప సాయి రెండు రోజుల జైలు శిక్ష విధించారు. కోటగిరి పోలీసులు డ్రంకన్ డ్రైవ్ తనిఖీలు నిర్వహించగా.. గౌతమ్ శింగరే, షేక్ హుస్సేన్ అనే వ్యక్తులు మద్యం తాగి పట్టుబడ్డారు. వారిని బుధవారం కోర్టు ఎదుట హాజరు పర్చగా జడ్జి జైలు శిక్ష విధించినట్లు ఎస్సై సందీప్ తెలిపారు.