అక్షరటుడే, కోటగిరి: విద్యార్థులకు చట్టాలపై అవగాహన కలిగి ఉండాలని బోధన్ కోర్టు న్యాయమూర్తులు సాయి శివ, పూజిత అన్నారు. శనివారం మండల కేంద్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో న్యాయసేవాధికార సంస్థ ఆధ్వర్యంలో అవగాహన సదస్సు నిర్వహించారు. ర్యాగింగ్‌కు దూరంగా ఉండాలని సూచించారు. కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపాల్ కైసర్ పాషా, బోధన్ సీఐ వెంకటనారాయణ, ఎస్సై సందీప్, తదితరులు పాల్గొన్నారు.