ఎంపీ అర్వింద్‌కు పరాభవం తప్పదు

అక్షరటుడే, వెబ్ డెస్క్: పార్లమెంట్‌ ఎన్నికల్లో సిట్టింగ్‌ ఎంపీ అర్వింద్‌కు పరాభవం తప్పదని బీఆర్‌ఎస్‌ నిజామాబాద్‌ ఎంపీ అభ్యర్థి బాజిరెడ్డి గోవర్ధన్‌ అన్నారు. అర్వింద్‌ బూటకపు మాటలతో విసిగిపోయిన ప్రజలు ఆయనకు గుణపాఠం చెప్పేందుకు సిద్ధంగా ఉన్నారని పేర్కొన్నారు. మంగళవారం కోరుట్ల మండలంలోని పలు గ్రామాల్లో స్థానిక ఎమ్మెల్యే సంజయ్‌తో కలిసి పాదయాత్ర నిర్వహించిన ఆయన ఇంటింటి ప్రచారం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీల్లో ఏ ఒక్కటి కూడా నెరవేర్చలేదని విమర్శించారు. పసుపు బోర్డు ఏర్పాటు కేవలం ప్రకటనకే పరిమితమైంద న్నారు. ప్రజల ఆదరణతో తాను ఎంపీగా ఘనవిజయం సాధిస్తానని ధీమా వ్యక్తం చేశారు.

Advertisement
Advertisement
Advertisement